గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-01-20T07:04:34+05:30 IST

మండలంలోని కృష్ణానదిలో ఈ నెల 17వ తేదీన గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం
అడ్లూరులోని చెరువు వద్దకు చేరిన గ్రామస్థులు

నాలుగు గంటలు శ్రమించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

 17న కృష్ణానదిలో  బాలుడు, యువకుడు గల్లంతు

 ఫలితం లేకపోవడంతో రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌


చింతలపాలెం, జనవరి 19:  మండలంలోని కృష్ణానదిలో ఈ నెల 17వ తేదీన గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. 24గంటల పాటు స్థానిక జాలర్లు శ్రమించినా ఫలితం లేకపోవడంతో అధికారు లు ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలను రప్పించారు. దీంతో బుధవారం ఉదయం 20 మంది నాలుగు గంటల పాటు శ్రమించడంతో యువకుల మృతదేహాలు నీటిలో తేలా యి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన కొమ్ము గోపి(12), కందుకూరి చంద్రశేఖర్‌(25) ఈ నెల 17వ తేదీన కృష్ణానదిలో చేపల వలలను తీసేందుకు వెళ్లి గల్లంతయ్యారు. జాలర్ల సమాచారంతో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని స్థాని క జాలర్లతో కృష్ణానదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. 100మంది జాలర్లు 20 ఇంజన్‌ పడవలతో 24గంట లు పాటు గాలించినా ప్రయోజనం లేకుండా పోవటం తో  కలెక్టర్‌ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించారు. 

మనసంతా అలజడే... తెల్లారితే అక్కడే

రెండు రోజులుగా అడ్లూరు గ్రామంలో ఆవేదనతో కూడిన ఆందోళన నెలకొంది. ఊరి జనంతో పాటు సమీప వెల్లటూరు, రేబల్లె తండావాసుల్లోనూ వాళ్లే.. చేతికంది వస్తున్న పిల్లలు; అందరిలోనూ బతికి రావాలనే ప్రార్థన.. మనసులో అలజడులు వారిని ఇంటి వద్ద కుదురుగా నిలువకుండా చేశాయి. వాతావరణం చల్లగా ఉన్నా తెల్లవారుజాము ఆరు గంటలకే చెరువు దగ్గరకు చేరి.. తలో దిక్కున వెతికారు. సుమారు వంద మంది జాలర్లు నదిలో వెతుకులాడారు. ఇరు కుటుంబాల్లోనూ ఆ ఇరువురు పెద్దకుమారులే కావడం గమనార్హం. 

లైసెన్స్‌ ఉన్న వారే వేటకు వెళ్లాలి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండి లైసెన్స్‌ కలిగిన వారే చేపల వేటకు వెళ్లాలి.  అదేవిధంగా పడవ ఫిట్‌నెస్‌తో పాటు లైఫ్‌ జాకెట్స్‌ ధరించి మాత్రమే చేపల వేటకు వెళ్లాలి.. ఈ  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలతో పాటు భారీమొత్తంలో జరిమానా విధించి, పడవలను సీజ్‌ చేస్తాం. 

  –  వెంకారెడ్డి, ఆర్డీవో, హుజూర్‌నగర్‌

20 మంది నాలుగు గంటల పాటు..

ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ సంజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని 20 మందితో కూడి న బృం దం బుధవారం అడ్లూరుకు చేరుకుంది. ఉద యం 6.30 గం టల నుంచి గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రబ్బరు ఇం జన్‌ పడవలలో వాటర్‌ప్రూఫ్‌ కెమెరాలతో గాలించారు. పడవ ల కుదుపుతో ఉదయం 8 గంటల సమయంలో శ్రీగోపి మృతదేహం బయటపడగా; 10.30 గంటలకు చంద్రశేఖర్‌ మృత దేహం బయటపడ్డాయి. పోస్టుమార్టం అనంతరం అడ్లూరులో వైకుంఠ ధామంలో ఇద్దరు యువకుల మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తిచేశారు. 











Updated Date - 2022-01-20T07:04:34+05:30 IST