యువతిపై ఇద్దరు సోదరుల అఘాయిత్యం

ABN , First Publish Date - 2021-01-17T00:04:41+05:30 IST

ఓ యువతికి దుబాయ్ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తామని,పెళ్లి చేసుకుంటామని ఆశ చూపించి ఆమెపై ఇద్దరు సోదరులు అత్యాచారం జరిపిన దారుణ....

యువతిపై ఇద్దరు సోదరుల అఘాయిత్యం

బెంగళూరు :  ఓ యువతికి దుబాయ్ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తామని,పెళ్లి చేసుకుంటామని ఆశ చూపించి ఆమెపై ఇద్దరు సోదరులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన బెంగళూరు నగరంలోని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు ప్రాంతంలో జరిగింది. బెంగళూరులోని ఓ స్పాలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతికి తమ సంస్థలో ఉద్యోగమిస్తామని చెప్పి షబ్బీర్ అనే వ్యక్తి ఆమెను హోటల్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం షబ్బీర్ సోదరుడు ముహమ్మద్ దుబాయ్ లో ఉద్యోగమిప్పిస్తానని,  తాను పెళ్లి చేసుకుంటానని యువతికి మభ్యపెట్టి అతను కూడా అత్యాచారం జరిపాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ముహూర్తం కూడా నిశ్చయించి మోసగించాడు. యువతి ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-17T00:04:41+05:30 IST