ఇద్దరు సీఎంలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు సీపీఎం నేతలకు కరోనా

ABN , First Publish Date - 2022-01-11T01:54:29+05:30 IST

నిత్యం ప్రజలతో మమేకమయ్యే రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా..

ఇద్దరు సీఎంలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు సీపీఎం నేతలకు కరోనా

న్యూఢిల్లీ: నిత్యం ప్రజలతో మమేకమయ్యే రాజకీయ ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు సీపీఎం నేతలు కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో వీరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి అజయ్ భట్, సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, బృందాకారత్ వీరిలో ఉన్నారు.


 కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఒక ట్వీట్‌లో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అయితే లక్షణాలు చాలా స్పల్పంగా ఉన్నాయని, ఆరోగ్యానికి ఢోకా లేదని, హోం క్వారంటైన్‌లో ఉన్నాయని తెలిపారు. నితీష్ కుమార్ సైతం తనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, వైద్యుల సలహాతో ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు ట్వీట్ చేశారు. కోవిడ్ పాజిటివ్, స్వల్ప లక్షణాలతో హోం ఐసొలేషన్‌లో ఉన్నట్టు రాజ్‌నాథ్, అజయ్ భట్‌లు వేర్వేర్లు ట్వీట్లలో తెలియజేశారు.


ప్రకాష్ కారత్, బృందా కారత్‌లకు కూడా...

కాగా, సీపీఎం జాతీయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, బృందాకారత్‌లు సైతం కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. వీరిలో కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీరిరువురు ఐసొలేషన్‌లో ఉన్నారు.

Updated Date - 2022-01-11T01:54:29+05:30 IST