Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేయసితో కారులో షికారుకెళ్లిన తండ్రి.. నడిరోడ్డుపై అడ్డుకున్న కూతుళ్లు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

రాజస్థాన్: కారులో బయటికి వెళ్తున్న ఆ తండ్రిని కూతుళ్లిద్దరూ చూశారు. కానీ తండ్రితో పాటు పక్కన ప్రేయసిని కూడా చూసి వారు షాకయ్యారు. నడిరోడ్డుపై తండ్రి వెళ్తున్న కారును ఆపి దానికి అడ్డంగా నిల్చున్నారు. ఆ తర్వాత అక్కడ గంటపాటు హైడ్రామా జరిగింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. అసలు విషయానికొస్తే..


భిల్వారాలోని దియోలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కానీ ఆ తండ్రి భార్యాబిడ్డల్ని పట్టించుకోకుండా ప్రేయసి మోజులో పడి షికార్లకు వెళ్తుండడంతో కుటుంబసభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ప్రియురాలితో కలిసి కారులో షికారుకు వెళ్లిన అతడు కూతుళ్ల కంటపడ్డాడు. డేవిల్ టౌన్‌లోని కుఛ్వాడ రోడ్ మీదకు తండ్రి రాగానే కూతుళ్లు అక్కడకు వెళ్లి కారు కదలనీయకుండా అడ్డునిల్చున్నారు. కారులో నుంచి తండ్రి ప్రియురాలిని కిందకు లాగి ఆమెపై అక్కాచెల్లెళ్లిద్దరూ దాడి చేశారు. ఆగ్రహంతో ఆమెను కిందపడేసి కాలితో తన్నారు. అక్కడకు చేరుకున్న స్థానికులు కలగజేసుకోవడంతో ఆమె తప్పించుకుని వెళ్లిపోయింది.

అక్కాచెల్లెళ్లు మాట్లాడుతూ.. తమ తండ్రి ప్రియురాలితో గత కొన్ని నెలలుగా అక్రమసంబంధం కొనసాగిస్తున్నాడని అన్నారు. ఈ కారణంగా తమ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, తమ తల్లి జీవితం నాశనం అయిందని వాపోయారు. కానీ తమ తండ్రి మాత్రం హ్యాపీగా ప్రేయసితో షికార్లు చేస్తున్నాడని అన్నారు. అయితే నడిరోడ్డు మీద ఇలా గొడవ చేసి తన పరువు తీశారని ఆ తండ్రి కూతుళ్లతో వాగ్వాదానికి దిగాడు. అయితే కూతుళ్లు కూడా తగిన విధంగా తండ్రికి సమాధానమిచ్చారు. అందరిముందే ప్రియురాలితో తిరిగినపుడు పరువు, మర్యాద పోలేదా.. అని తండ్రిని నిలదీశారు. ఈ అక్రమసంబంధం వల్ల రెండునెలలుగా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement