దేశవ్యాప్తంగా రెండురోజుల పాటు bank strike

ABN , First Publish Date - 2021-12-14T17:41:57+05:30 IST

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేర...

దేశవ్యాప్తంగా రెండురోజుల పాటు bank strike

న్యూఢిల్లీ: బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేర దేశంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు రెండురోజుల పాటు సమ్మె చేయనున్నారు. ఈ నెల 16,17 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి.బ్యాంకు ఉద్యోగుల సమ్మెల కారణంగా తమ కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంకులు తెలిపాయి. కొవిడ్ మహమ్మారి సమయంలో బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు రెండురోజుల పాటు సమ్మె చేయవద్దని ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, యూకో బ్యాంకు యాజమాన్యాలు ఉద్యోగులకు విన్నవించాయి.



బ్యాంకుల ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోకుంటే తమ ఉద్యోగులు సమ్మెతో పాటు ఇతర ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్ల సంఘం జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ చెప్పారు. 2021 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు చెప్పారు.ప్రభుత్వం ఇప్పటికే 2019లో మెజారిటీ వాటాను విక్రయించడం ద్వారా ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేటీకరించింది. గత నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది.

Updated Date - 2021-12-14T17:41:57+05:30 IST