Greece: సముద్రంలో కూలిన సెస్నా విమానం..ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-09-14T12:57:01+05:30 IST

గ్రీస్ దీవుల సమీపంలోని సముద్రంలో ఓ చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు మరణించారు....

Greece: సముద్రంలో కూలిన సెస్నా విమానం..ఇద్దరి మృతి

సమోస్ (గ్రీస్): గ్రీస్ దీవుల సమీపంలోని సముద్రంలో ఓ చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు మరణించారు.  గ్రీస్ దేశంలోని సమోస్ ద్వీపానికి సమీపంలోని ఏజియన్ సముద్రంలో ఒకే ఇంజిన్ విమానం కూలిపోయింది.సముద్రంలో కూలిన సెస్నా 172 విమానంలో నుంచి ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను కోస్ట్ గార్డు వెలికితీసింది. సింగిల్ ఇంజన్ ఉన్న సెస్నా విమానం ఇజ్రాయెల్ నుంచి సమోస్ వైపు వెళుతుండగా సాంకేతిక లోపం ఏర్పడి సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై ఏవియేషన్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. సముద్రంలో విమాన శకలాలను గుర్తించారు.


Updated Date - 2021-09-14T12:57:01+05:30 IST