దిక్కు లేని దవాఖానా

ABN , First Publish Date - 2020-07-09T11:17:15+05:30 IST

చర్ల.. భద్రాద్రి జిల్లాలో అత్యంత మారుమూల గిరి జన మండలం. వర్షాకాలంలో అయితే ఇక్కడ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతాయి.

దిక్కు లేని దవాఖానా

చర్ల సీహెచ్‌సీ, సీమాంగ్‌ సెంటర్‌లో వైద్యుల లేమి

వైద్యం అందక మూడు రోజుల్లో ఇద్దరు మృతి 

పట్టించుకోని జిల్లా వైద్యాధికారులు 

కలెక్టర్‌, పీవో చొరవ చూపాలని స్థానికుల డిమాండ్‌


చర్ల, జులై 8: చర్ల.. భద్రాద్రి జిల్లాలో అత్యంత మారుమూల గిరి జన మండలం. వర్షాకాలంలో అయితే ఇక్కడ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతాయి. అసలే ఇది కరోనా కాలం.. మనిషి పక్కన మనిషి నిల్చునేందుకే భయపడే రోజులు. ఇలాంటి సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మాములు రోజుల్లో కన్నా విస్తృతంగా వైద్య సేవలందించాలి. కానీ ఇక్కడి వైద్యశాలను కొయ్యూరుకు తరలించారు. ఫలితంగా చర్ల వాసులకు వైద్యం అందకుండా పో యింది. ఇక్కడ కనీసం ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా లేకపోవ డంతో గిరిజనులు పడుతున్న బాధ లు వర్ణనాతీతం. ఇక్కడి ప్రభుత్వ వైద్యశాలకు ప్రతీ రోజు సుమా రు 150 నుంచి 200 మంది గిరిజనులు వచ్చి పరీక్షలు చేయించుకుంటారు. ముగ్గురు నర్సులు మాత్రమే షిప్టులు ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. వచ్చిన రోగులకు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. అత్యవసరం అయితే మూడు కిలోమీటర్ల దూరంలోని కొయ్యూరు, తొమ్మిది కిలోమీటర్లు దూరంలోని సత్యనారాయణ పురం వైద్యశాలలకు వెళ్లాలని సూచిస్తున్నారు. 


ఇంత దారుణమా?

చర్ల వైద్యశాల్లో సీమాంగ్‌ సెంటర్‌ 2006, సీహెచ్‌సీ 2011లో ఏర్పాటు చేశారు. దీని ప్రకారంగా చర్ల వైద్యశాలను కొయ్యూరు తరలించారు. కానీ ఇప్పటి వరకు సీమాంగ్‌ సెంటర్‌కు మగ్గురు నర్సులను మాత్రమే నియమించారు. కేటాయించిన వైద్యులు డిప్యుటేషన్‌ పై వెళ్లిపోయారు. సీహెచ్‌సీకి ఒక్క వైద్యుడిని కేటాయించలేదు. చర్ల పీహెచ్‌సీ కొయ్యూరు వెళ్లిపోవడంతో సీమాంగ్‌ సెంటర్‌కు నియమించిన నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం అధిక సంఖ్యలో రోగులు రాగా నర్సు మందులు ఇచ్చి పంపించారు.


జీవోలు లేక పోవడమే కారణమా 

చర్ల సీహెచ్‌సీ వైద్యులను కేటాయించక పోవడానికి జీవో లేక పో వడమే కారణంగా తెలుస్తోంది. జీవో ఉంటే దాని ప్రకారం వైద్యులను కేటాయించవచ్చు అనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంగ్‌ సెంటర్‌ జీవో కూడా కనబడటం లేదని తెలుస్తోంది. వీటి కోసం కొద్ది రోజులుగా అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. 


మూడు రోజుల్లో  ఇద్దరు మృతి

వైద్యులు లేక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఆక్సిజన్‌ అందక సోమవారం రాత్రి మహిళ చనిపోగా, ఆదివారం కూలి పనులు చేసుకునే ఓ వ్యక్తి వాతులతో చర్ల వైద్యశాలకు వెళ్లగా, వైద్యులు అందుబాటులో లేక కన్నుమూశాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఇ క్కడి ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-09T11:17:15+05:30 IST