Abn logo
Oct 9 2021 @ 11:48AM

రెండు జిల్లాల్లో 16మందికి కరోనా పాజిటివ్

ఖమ్మం/కొత్తగూడెం: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 16మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం 5560 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురు, భద్రాద్రి జిల్లాలో మొత్తం 954 మందికి పరీక్షలు చేయగా తొమ్మిది మందికి పాజిటివ్‌, నిర్ధారణైంది. ఇక 320బెడ్లున్న ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డులో శుక్రవారం ముగ్గురు చేరగా ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 19మంది చికిత్స పొందుతుండగా 301 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.