Abn logo
Sep 19 2021 @ 10:52AM

రెండు జిల్లాల్లో వందల్లో కరోనా కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో బెంగళూరు, దక్షిణకన్నడ జిల్లాల్లో వందలసంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం 889 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 263, దక్షిణకన్నడలో 133 మందికి వైరస్‌ ప్రబలింది. చిక్కబళ్ళాపుర, హావేరి, కొప్పళ, విజయపుర, యాదగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 11 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 12 జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. 1080 మంది డిశ్చార్జ్‌ కాగా 14మంది మృతి చెందారు. 23 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతి చెందలేదు. ప్రస్తుతం 15,755 మంది చికిత్సలు పొందుతున్నారు.