Abn logo
Sep 24 2021 @ 11:57AM

రెండు జిల్లాల్లోనే కరోనా ప్రభావం..

బెంగళూరు: రాష్ట్రంలో రెండు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 836 మందికి పాజిటివ్‌ నిర్దారణ కాగా బెంగళూరులో 310, దక్షిణ కన్నడలో 106, మైసూరు 78, ఉడిపి 69 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పది జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదు కాగా 9 జిల్లాల్లో 50 లోపు కేసులు నమోదయ్యాయి. 852 మంది డిశ్చార్జ్‌ కాగా 15 మంది మృతిచెందారు. వీరిలో బెంగళూరులో ఏడుగురు, దక్షిణ కన్నడలో ముగ్గురు మృతి చెందగా మరో ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.