Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 21 2021 @ 16:21PM

రాజ్యసభకు ఇద్దరు డీఎంకే అభ్యర్థులు నామినేషన్

చెన్నై: తమిళనాడు నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల కోసం డీఎంకే అభ్యర్థులుగా డాక్టర్ కనిమొళి ఎన్‌వీఎన్ సోము, కేఆర్ఎన్ రాజేష్‌కుమర్ మంగళవారంనాడు నామినేషన్లు వేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు అందజేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైత హాజరయ్యారు. కనిమొళి ఎన్‌వీఎన్ సోము, కేఆర్‌న్ రాజేష్ పేర్లను పార్టీ అభ్యర్థులుగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఇటీవల ప్రకటించారు. అన్నాడీఎంకే సభ్యులు ఆర్.వైద్యలింగం, కేపీ మునుస్వామి రాజీనామాలతో ఈ రెండు సీట్లకు ఖాళీ ఏర్పడింది. అక్టోబర్ 4న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులోని రెండు రాజ్యసభ స్థానాలతో పాటు పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్‌లలో ఒక్కో స్థానం చొప్పున మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement