యూరప్ మహిళలపై మందుబాబుల లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-07-02T18:41:10+05:30 IST

యూరప్ దేశాలకు చెందిన ఇద్దరు మహిళలను మందుబాబులు లైంగికంగా వేధించిన ఘటన...

యూరప్ మహిళలపై మందుబాబుల లైంగిక వేధింపులు

తిరువనంతపురం (కేరళ): యూరప్ దేశాలకు చెందిన ఇద్దరు మహిళలను మందుబాబులు లైంగికంగా వేధించిన ఘటన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలోని వరకల పాపనాశనం బీచ్ లో జరిగింది. యూకే, ఫ్రాన్సు దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు వరకల పాపనాశనం బీచ్ కు వచ్చారు. విదేశీ మహిళలను చూసిన మందుబాబులు వారిని లైంగికంగా వేధించారు. విదేశీ పర్యాటకులు గత 6 నెలలుగా తిరువనంతపురంలోనే నివాసముంటున్నారు. విదేశీ వనితలను లైంగికంగా వేధించిన మందుబాబుల బృందంలో సభ్యుడైన మహేష్ ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-02T18:41:10+05:30 IST