కాలేజీ ఆవరణలోనే తన్నుకున్న ఇద్దరు యువతులు.. ప్రియుడి కోసం కాదండోయ్.. కారణం తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-01T17:54:12+05:30 IST

ఇద్దరు యువతులు కాలేజీ ఆవరణలో కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాలేజీ ఆవరణలోనే తన్నుకున్న ఇద్దరు యువతులు.. ప్రియుడి కోసం కాదండోయ్.. కారణం తెలిస్తే..

ఇద్దరు యువతులు కాలేజీ ఆవరణలో కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతులిద్దరూ కొట్టుకున్నది బాయ్‌ఫ్రెండ్ కోసం కాదు.. ఓ డ్రెస్ కోసం. ఓ డ్రెస్ విషయంలో ఇద్దరి మధ్య పేచీ రావడంతో వారిద్దరూ కాలేజీ ఆవరణలోనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. మిగతా స్నేహితులు వారిని విడదీయడం మానేసి తమ సెలఫోన్లలో ఆ ఫైట్‌ను రికార్డు చేసుకున్నారు. ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేశారు. మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ కాలేజీలో ఈ ఘటన జరిగింది. 


స్నేహితురాలికి ఇచ్చిన డ్రెస్‌ను పాడు చేసిందనే కారణంతో ఒక అమ్మాయి మరో అమ్మాయిపై విరుచుకుపడింది. కాలేజీ ఆవరణలోనే ఇద్దరూ ఫైటింగ్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది. ఇద్దరికీ వార్నంగ్ ఇచ్చింది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నిజమైన ఫ్రీ స్టైల్ ఫైట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-01T17:54:12+05:30 IST