అత్యాచారంపై నిరసన...200 మంది మహిళా కార్మికుల తొలగింపు

ABN , First Publish Date - 2021-11-27T17:55:05+05:30 IST

సహోద్యోగిపై అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని జార్ఖండ్‌ రాష్ట్రంలో 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించారు...

అత్యాచారంపై నిరసన...200 మంది మహిళా కార్మికుల తొలగింపు

జంషెడ్‌పూర్ (ఝార్ఖండ్): సహోద్యోగిపై అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని జార్ఖండ్‌ రాష్ట్రంలో 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించారు.తూర్పు సింగ్‌భూమ్‌కు చెందిన దాదాపు 200 మంది మహిళా కార్మికులను ఉద్యోగాల నుంచి అకస్మాత్తుగా తొలగించారు. ఓ మహిళా కార్మికురాలిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా తోటి మహిళా కార్మికులు ఆందోళన చేశారు.ధాల్‌భూమ్‌గఢ్‌లో నవంబర్ 19న కంపెనీ ఫ్లోర్ షాప్ మేనేజర్ ఓ మహిళను తన గదికి పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ బాధిత మహిళ సహోద్యోగులకు తన గోడును వివరించింది.దీంతో నిందితుడిపై చర్య తీసుకోవాలని మహిళలు యాజమాన్యాన్ని ఆశ్రయించారు. 


‘‘కానీ యాజమాన్యం నిందితుడిపై చర్య తీసుకోకుండా, యాజమాన్యం మమ్మల్ని మా ఉద్యోగాల నుంచి తొలగించింది’’  అని ఓ కార్మికురాలు చెప్పారు.కంపెనీ తమకు సరైన జీతం ఇవ్వడం లేదని, సరైన భోజనం కూడా పెట్టడం లేదని మహిళా కార్మికులు ఆరోపించారు.కాగా రాష్ట్ర కార్మిక శాఖ అధికారులకు ఈ విషయం తెలియజేశామని, వారు దీనిపై విచారణ జరుపుతున్నారని ఘట్‌శిల ఎమ్మెల్యే రాందాస్ సోరెన్ చెప్పారు. 


Updated Date - 2021-11-27T17:55:05+05:30 IST