UAE: ఇద్దరు భారత రచయితలకు గోల్డెన్ వీసా

ABN , First Publish Date - 2021-07-17T15:01:53+05:30 IST

యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న వారి జాబితాలో తాజాగా ఇద్దరు భారత రచయితలు చేరారు. దీబా సలీం ఇర్ఫాన్, రాజీవ్ గుప్తాకు యూఏఈ సర్కార్ 10 ఏళ్ల గోల్డెన్ వీసా మంజూరు చేసింది. దీబా సలీం గత 22 ఏళ్లుగా దుబాయిలోనే నివాసం ఉంటున్నారు.

UAE: ఇద్దరు భారత రచయితలకు గోల్డెన్ వీసా

అబుధాబి: యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న వారి జాబితాలో తాజాగా ఇద్దరు భారత రచయితలు చేరారు. దీబా సలీం ఇర్ఫాన్, రాజీవ్ గుప్తాకు యూఏఈ సర్కార్ 10 ఏళ్ల గోల్డెన్ వీసా మంజూరు చేసింది. దీబా సలీం గత 22 ఏళ్లుగా దుబాయిలోనే నివాసం ఉంటున్నారు. ఇప్పటికే మూడు పుస్తకాలు రాశారు. ప్రస్తుతం నాలుగో పుస్తకం రాస్తున్నారు. భారత్ నుంచి యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న అతి తక్కువ మంది రచయిత్రిలలో దీబా సలీం ఒకరు. ఆమె అడ్వర్టైసింగ్ ప్రొఫెషనల్‌గా కూడా పని చేశారు. ఆమెకు యూఏఈ ప్రభుత్వం 'కల్చర్ అండ్ ఆర్ట్' విభాగంలో గోల్డెన్ వీసా మంజూరు చేసింది. 


ఈ సందర్భంగా దీబా సలీం దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గోల్డెన్ వీసా అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆమె రాసిన 'చార్కోల్ బ్లష్' పుస్తకానికి కెనడాలో 2017 బుక్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. చార్‌కోల్ బ్లష్‌కు ఇప్పటికే చాలా ప్రశంసలు దక్కాయి. అలాగే ఆమె రంచించిన మొదటి నవల 'ఉమ్రా'ను ఉర్దూలో ట్రాన్స్‌లేట్ చేసి విడుదల చేయగా, ఇది కూడా అవార్డుకు నామినేట్ అయింది. ప్రస్తుతం ఆమె '365 డేస్' అనే నవల రాస్తున్నారు. 


గోల్డెన్ వీసా అందుకున్న మరో రచయిత రాజీవ్ గుప్తా.. లైమ్ సోర్స్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు, సీఈఓ. దీనికి దుబాయ్, కెనడాలో బ్రాంచీలు ఉన్నాయి. గుప్తా చాలా చిన్న వయస్సులోనే కేవలం 300 దిర్హమ్స్ సేవింగ్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుండి గుప్తా ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. ఇప్పుడు అతని వద్ద 30 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం ఉంది. గుప్తా గతంలో ప్రెస్టీజియస్ గ్లోబల్ సీఈఓ ఎక్సలెన్స్ అవార్డును కూడా గెలుచుకున్నారు. అతని పుస్తకం '50 సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్' యూఏఈలో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో ఈ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది.  

Updated Date - 2021-07-17T15:01:53+05:30 IST