అబుధాబిలో డ్రోన్‌ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

ABN , First Publish Date - 2022-01-18T10:05:58+05:30 IST

యూఏఈ రాజధాని అబుధాభిలో సోమవారం చోటుచేసుకున్న పేలుళ్లు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ పేలుళ్లు అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో జరిపిన దాడులుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడులు తమ పనేనని...

అబుధాబిలో డ్రోన్‌ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

అబుధాబి/కోపెన్‌హాగెన్‌, జనవరి 17: యూఏఈ రాజధాని అబుధాభిలో సోమవారం చోటుచేసుకున్న పేలుళ్లు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ పేలుళ్లు అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో జరిపిన దాడులుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడులు తమ పనేనని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు(రెబల్స్‌) ప్రకటించుకున్నారు. కాగా, స్వీడన్‌లోని బాల్టిక్‌ సముద్ర తీరాన ఉన్న రెండు అణువిద్యుత్‌ ప్లాంట్ల వద్ద డ్రోన్ల సంచారం స్థానికంగా కలకలం రేపింది. 


Updated Date - 2022-01-18T10:05:58+05:30 IST