Advertisement
Advertisement
Abn logo
Advertisement

Dubai లో విషాద ఘటన.. ఇద్దరు భారతీయులను బలిగొన్న Sports bike

దుబాయ్: దుబాయ్‌లోని బర్షాలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు భారత వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మృతులలో ఒకరిని కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన నిఖిల్ ఉన్ని(40)గా, మరోకరిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా దుబాయ్ పోలీసులు గుర్తించారు. దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు వ్యక్తితో కలిసి నిఖిల్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ బర్షా వద్ద అదుపు తప్పి ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  

నిఖిల్ అక్కడికక్కడే చనిపోగా, తమిళనాడు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిఖిల్ ఓ పెట్రోకెమికల్ కంపెనీలో లాజిస్టిక్ మేనేజర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఆయనకు భార్య దక్ష, కుమారుడు అఖిల్ ఉన్ని ఉన్నారు. కుటుంబంతో కలిసి కొన్నేళ్లుగా దుబాయ్‌లోనే నివాసం ఉంటున్నాడు. నిఖిల్ మృతితో ఆయన స్వస్థలం కోజికోడ్‌లోని కామ్‌పూరంలో విషాదం అలుముకుంది. దుబాయ్ నుంచి నిఖిల్ మృతదేహాన్ని కేరళకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, తమిళనాడు వ్యక్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.   


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement