హైతీ ద్వీపంలో భూకంపం...ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2022-01-25T12:55:31+05:30 IST

నైరుతి హైతీని రెండు మోస్తరు భూకంపాలు వణికించాయి....

హైతీ ద్వీపంలో భూకంపం...ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

పోర్ట్ ఔ ప్రిన్స్:నైరుతి హైతీని రెండు మోస్తరు భూకంపాలు వణికించాయి. హైతీ ద్వీపంలో సంభవించిన భూకంపం వల్ల ఇద్దరు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన హైతీ యొక్క దక్షిణ ద్వీపకల్పంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది.ఈ భూకంపం వల్ల పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మరో 50 మంది పాఠశాల విద్యార్థులు షాక్ కు గురవడంతో ఆసుపత్రికి తరలించారు.ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.ఈ భూకంపం వల్ల 191 ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు.భూకంపం కారణంగా ఇసుక గనిలో కొండచరియలు విరిగిపడటంతో ఒకరు మరణించారని నిప్పేస్ అధికారులు చెప్పారు. 




భూకంపంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగుతీశారు.హైతీ దేశంలోని దక్షిణ ప్రాంతానికి చెందిన హైతీ పౌర రక్షణ సంస్థ డైరెక్టర్ సిల్వెరా గుయిలేమ్ ఈ ప్రాంతంలోని పాఠశాలలను మూసివేసి ముందుజాగ్రత్తగా పిల్లలను ఇంటికి పంపించారు.ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ భూకంపం బాధితులకు తన సంతాపాన్ని తెలిపారు.గత ఏడాది ఆగస్టు 14న నైరుతి హైతీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,200 మందికి పైగా మరణించారు. 1,37,500 గృహాలు దెబ్బతిన్నాయి.


Updated Date - 2022-01-25T12:55:31+05:30 IST