China: సిచువాన్ ప్రావిన్సులో భూకంపం..ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-09-16T13:36:53+05:30 IST

చైనా దేశంలోని సిచువాన్ ప్రావిన్సులో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, డజన్ల కొద్దిమంది గాయపడ్డారు...

China: సిచువాన్ ప్రావిన్సులో భూకంపం..ఇద్దరి మృతి

డజన్ల కొద్దిమందికి గాయాలు

బీజింగ్ : చైనా దేశంలోని సిచువాన్ ప్రావిన్సులో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, డజన్ల కొద్దిమంది గాయపడ్డారు. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్సు పరిధిలోని జిజుజాగౌలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని చైనా భూకంప నెట్ వర్క్ సెంటర్ తెలిపింది. భూకంపం వల్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాంగ్ కింగ్ మెగాసిటీకి నైరుతి దిశలో 120 కిలోమీటర్ల దూరంలోని లగ్జియన్ కౌంటీని కూడా భూకంపం తాకింది. లగ్జియన్ కౌంటీలో 30 మిలియన్ల మంది ప్రజలు నివశిస్తున్నారు. 


10కిలోమీటర్ల లోతులో వచ్చిన భూకంపం వల్ల ఇద్దరు మరణించగా, డజన్ల కొద్దిమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.భూకంపం వల్ల పర్యాటక వీధిలోని రెస్టారెంట్ బయట కుర్చీలు ముక్కలై చెల్లాచెదురయ్యాయి. సిచువాన్ అత్యవసర ప్రతిస్పందన బలగాలు రంగంలోకి దిగి సహాయ పునరావాస పనులు చేపట్టాయి.ఈ భూకంపం వల్ల కౌంటీ నగరంలో 22 ఇళ్లు కూలిపోయాయని లక్సియన్ అధికారులు చెప్పారు. 


Updated Date - 2021-09-16T13:36:53+05:30 IST