Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ అమ్మాయిలిద్దరూ స్నేహితులు.. రెండు నెలల క్రితం ఇళ్ల నుంచి పారిపోయారు.. వెతికి పట్టుకున్న పోలీసులకు వాళ్లిచ్చిన షాక్ ఏంటంటే..

ఆ అమ్మాయిలిద్దరూ ఏడాది క్రితం స్నేహితులుగా మారారు.. పక్క పక్క ఇళ్లలోనే ఉండే వారిద్దరూ కలిసి తిరిగేవారు.. గతేడాది నవంబర్ నెలలో ఇద్దరూ ఇళ్ల నుంచి పరారయ్యారు.. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రెండు నెలలు అన్వేషణ సాగించి ఇటీవల వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు.. స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.. అయితే తామిద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. 


హర్యానాకు చెందిన కృష్ణా నాయక్ అనే యువతి కుటుంబం ఏడాది క్రితం రాజస్థాన్‌లోని చురు గ్రామానికి వెళ్లి స్థిరపడింది. ఇంటి పక్కనే ఉన్న మమత అనే యువతితో కృష్ణా నాయక్‌కు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి తిరిగేవారు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తమ పెళ్లికి కుటుంబాల నుంచి మద్దతు దొరకదు అనే అభిప్రాయంతో వారిద్దరూ గతేడాది నవంబర్‌లో గ్రామం నుంచి పరారయ్యారు. దీంతో ఇరు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


దాదాపు రెండు నెలల పాటు వారి గురించి పోలీసులు అన్వేషణ సాగించారు. చివరకు హర్యానాలో సికార్‌లో వారి ఆచూకీ పోలీసులకు లభించింది. వారిద్దరినీ వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు వారిద్దరూ షాకిచ్చారు. తామిద్దరం మేజర్లమని, తాము పెళ్లి చేసుకున్నామని చెప్పారు. దీంతో చేసేదేం లేక పోలీసులు తిరుగుముఖం పట్టారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement