అక్రమ మద్యం, శానిటైజర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-05-18T05:39:54+05:30 IST

మండలంలోని అల్లూరు గ్రామంలో అక్రమంగా అమ్ముతున్న తెలంగాణ మద్యం, శానిటైజర్లు పట్టుబడ్డాయని ఎస్‌ఐ మల్లికార్జున సోమవారం తెలిపారు.

అక్రమ మద్యం, శానిటైజర్ల పట్టివేత

  1. ఇద్దరి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు


ఉయ్యాలవాడ, మే 17: మండలంలోని అల్లూరు గ్రామంలో అక్రమంగా అమ్ముతున్న తెలంగాణ మద్యం, శానిటైజర్లు పట్టుబడ్డాయని ఎస్‌ఐ మల్లికార్జున సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన మేఘన ఇస్సాకు, భూపనపతి చిన్నమద్దిలేటి  అక్రమ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడం తో అక్కడి వెళ్లి సోదాలు చేశామన్నారు.   వారి వద్ద 10 తెలంగాణ మద్యం బాటిళ్లు, 40 శానిటైజర్లు పట్టుబడ్డాయన్నారు. వాటిని స్వాధీ నం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఈ నెల 31 వరకు రిమాండ్‌ విధించాలని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-05-18T05:39:54+05:30 IST