Abn logo
Sep 23 2021 @ 21:16PM

KFC Chicken Bucketల అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్.. అసలు కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌లో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం అవ్వడంతో పాటు వైరల్‌గా మారింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఏ కారణం వల్ల అరెస్ట్ చేశారో తెలుసుకుని షాక్ అవుతున్నారు. కేఎఫ్‌సీ చికెన్‌ను అక్రమంగా రవాణా చేస్తూ పట్టబడ్డారని తెలిసి కంగుతింటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..


ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్రభుత్వం మహమ్మారిని కట్టడి చేయడానికి కఠిన చర్యలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అక్లాండ్ నగరంలో లెవల్ 4 లాక్‌డౌన్‌ను విధించింది అక్కడి ప్రభుత్వం. అంతేకాకుండా రెస్టారెంట్‌‌లను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే లాక్‌డౌన్ కారణంగా కొందరు తమకు ఇష్టమైన ఆహారానికి దూరమై తెగ ఇబ్బంది పడుతున్నారు. దీన్నే కొందరు అవకాశంగా మలుచుకున్నారు. పక్క నగరాల నుంచి ఆహార పదార్థలను తీసుకొచ్చి.. ఆక్లాండ్‌లోని ప్రజలకు అందజేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు తాజాగా కేఎఫ్‌సీ బకెట్లను అక్రమంగా ఆక్లాండ్‌లోకి తరలిస్తూ పోలీసులకు పట్టబడ్డారు.  అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి, కారును పరిశీలించగా అందుంలోంచి పదుల సంఖ్యలో కేఎఫ్‌సీ చికెన్ బకేట్లు బయటపడ్డాయి. దీంతో ఆ యువకులను అదుపులోకి తీసుకోవడంతోపాటు, వారి వద్ద ఉన్న సుమారు రూ.51లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించినందుకుగానూ వారిపై కేసు నమోదు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. కాగా.. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...