రెండు నెలల కోటా 3 గంటల్లో పూర్తి!

ABN , First Publish Date - 2021-10-23T08:57:42+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి నవంబరు, డిసెంబరు నెల కోటా 3 గంటల్లో పూర్తయింది. దాదాపు 7.08 లక్షల రూ.300 దర్శన టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు.

రెండు నెలల కోటా 3 గంటల్లో పూర్తి!

  • నవంబరు, డిసెంబరు నెలలకు 7.08 లక్షల ‘ప్రత్యేక’ టికెట్లు
  • టీటీడీకి రూ.21.24 కోట్ల రాబడి.. నేడు సర్వదర్శనం టోకెన్ల విడుదల

తిరుమల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి నవంబరు, డిసెంబరు నెల కోటా 3 గంటల్లో పూర్తయింది. దాదాపు 7.08 లక్షల రూ.300 దర్శన టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. రెండు నెలలకు సంబంధించిన  టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.21.24 కోట్లు సమకూరింది. కాగా, శనివారం ఉదయం 9 గంటలకు నవంబరు నెలకు సంబంధించిన సర్వదర్శన టోకెన్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. కొవిడ్‌ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేసే ఆలోచన చేస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర గోశాలకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దినపత్రిక చైర్మన్‌ శివకుమార్‌ సుందరన్‌ కాంక్రీజ్‌ జాతికి చెందిన రెండు ఆవులను, రెండు దూడలను శుక్రవారం సమర్పించారు.

Updated Date - 2021-10-23T08:57:42+05:30 IST