‘రెమ్‌డెసివిర్‌’ కేసులో మరో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-05-11T09:22:55+05:30 IST

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న కేసులో పరారీలో ఉన్న ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు.

‘రెమ్‌డెసివిర్‌’ కేసులో మరో ఇద్దరి అరెస్టు

రెండు వయల్స్‌ స్వాధీనం


మదనపల్లె క్రైం, మే 10: రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో  విక్రయిస్తున్న కేసులో పరారీలో ఉన్న ఇద్దరిని  సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మదనపల్లె పట్టణం కోటవీధికి చెందిన షేక్‌. యూసఫ్‌ అలియాస్‌ యూసఫ్‌అలీ(35), ఆయన స్నేహితుడు అగర్తవీధికి చెందిన షేక్‌.ఖలీద్‌అలీ అలియాస్‌ అబ్దుల్‌ ఖలీద్‌అలీ(35), చిత్తూరు నగరంలో ఇండోకో రెమెడీస్‌ కంపెనీ రెప్రజెంటేటివ్‌ హరిప్రసాద్‌రెడ్డి, వాల్మీకిపురం పట్టణం బజారువీధికి చెందిన పి.నవీన్‌కుమార్‌ను టూటౌన్‌ పోలీసులు ఈనెల 7న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా అరెస్టు చేశారన్నారు. దర్యాప్తులో భాగంగా వీరి నలుగురితో పాటు చిత్తూరు కు చెందిన మెడికల్‌ స్టోర్‌ నిర్వాహకుడు బాలాజీ, ముంబైకి చెందిన ఆల్కామ్‌ ఫార్మసీ సంస్థ మేనేజరు వెంకటసుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో సోమవారం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు. అలాగే బాలాజీ నుంచి రెండు వయల్స్‌ను  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెమ్‌డెసివిర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3,490 కాగా, కొందరు  బ్లాక్‌లో రూ.20 నుంచి రూ.30 వేల వరకు విక్రయిస్తున్నారన్నారు. దీనిపై నిఘా ఉంచామన్నారు. సీఐ నరసింహులు, ఎస్‌ఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T09:22:55+05:30 IST