ఏలూరుకు ఇద్దరి తరలింపు

ABN , First Publish Date - 2020-03-27T11:08:08+05:30 IST

చింతలపూడిలో కరోనా అనుమానిత కేసు నమోదైంది.చింతలపూడి పంచాయతీలోని పాత చింతలపూడి గ్రామానికి

ఏలూరుకు ఇద్దరి తరలింపు

చింతలపూడి, మార్చి 26 : చింతలపూడిలో కరోనా అనుమానిత కేసు నమోదైంది.చింతలపూడి పంచాయతీలోని పాత చింతలపూడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి  హైదరా బాద్‌ నుంచి ఈ నెల 10వ తేదీన ఇంటికి వచ్చాడు. గత వారం రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతూ స్వయంగా ప్రభుతావసుపత్రి వచ్చాడు.అతన్ని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందించారు.


అయితే  మెరుగైన వైద్యం నిమి త్తం ఏలూరు తరలించాలని బాధితుడు కోరడంతో అంబులెన్స్‌లో తరలించినట్టు ప్రభుత్వాసు పత్రి సూపరింటెం డెంట్‌ రసూల్‌ చెప్పారు.రాఘవాపురంలో ఈ నెల 18వ తేదీన జరిగిన విందు నేపథ్యంలో గ్రామంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.విందుకు వెళ్లిన కుటుంబాలను స్వీయ గృహ నిర్భంధంలో ఉంచి వారిళ్లకు వెళ్లి పరీక్షలు జరుపుతున్నారు. ప్రజల్లో చైతన్యం కోసం ఈ ఇళ్ళకు ఎవ్వరు రావొద్దని హెచ్చ రిక బోర్డులు పెట్టారు.14 రోజుల పాటు స్వీయ గృహ నిర్భంధం ఉంటుందని డాక్టర్‌ కిరణ్‌ చైతన్య చెప్పారు.  అదే విధంగా దేవరపల్లి మండలం ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఇటీవల ఈ నెల 12న దూబాయ్‌ నుంచి వచ్చాడు. జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో వైద్యం నిమిత్తం ఏలూరు తరలించారు. 

Updated Date - 2020-03-27T11:08:08+05:30 IST