ఉత్తరప్రదేశ్‌లో బాలుడి కిడ్నాప్‌కు యత్నం.. ఇద్దరు నిజామాబాద్ వాసుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-14T17:43:14+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాలబాద్‌ జిల్లా కేంద్రంలో బాలుడిని కిడ్నాప్‌కు ఓ మహిళతో కలిసి ఇద్దరు యువకులు యత్నించారు. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం లోని జలాల్‌పూర్

ఉత్తరప్రదేశ్‌లో బాలుడి కిడ్నాప్‌కు యత్నం.. ఇద్దరు నిజామాబాద్ వాసుల అరెస్ట్

జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల అరెస్టు


రెంజల్‌(నిజామాబాద్): ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాలబాద్‌ జిల్లా కేంద్రంలో బాలుడిని కిడ్నాప్‌కు ఓ మహిళతో కలిసి ఇద్దరు యువకులు యత్నించారు. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం లోని జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన అశ్వక్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పరియమైంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మురాలబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు సదరు మహిళ అశ్వ క్‌తో ప్రణాళిక రచించింది. అశ్వక్‌ రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామం లోని ఓ వ్యక్తి కారును కిరాయికి తీసుకొని సాటాపూర్‌కు చెందిన ఇమ్రాన్‌ను డ్రైవర్‌గా తీసుకొని ఉత్తప్రదేశ్‌లోని మహిళ దగ్గరకు వెళ్లాడు. బాలుడిని కి డ్నాప్‌ చేసి 25కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. 


డబ్బులు ఇవ్వాలంటూ బాలుడి తండ్రికి డిమాండ్‌ చేశారు. ఇది గమనించిన ఇమ్రాన్‌ అశ్వక్‌ను అ క్కడే వదిలేసి సాటాపూర్‌కు వచ్చాడు. అనంతరం బాలుడిని కూడా అశ్వక్‌  వదిలేశాడు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు రెంజల్‌కు విచారణ నిమిత్తం వచ్చారు. అశ్వక్‌ అరెస్టు చేసి రెంజల్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేశారు. కా రు డ్రైవర్‌, మహిళను అరెస్టు చేసి ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకెళ్లారు. కుటుంబ ప ని నిమిత్తం తనను డ్రైవర్‌గా తీసుకెళ్లారని, బాలుడి కిడ్నాప్‌ చేస్తున్నారని తె లిసి వ్యతిరేకించి తిరిగి వచ్చేశానని, తనకు ఇందులో ప్రమేయంలేదని   ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు ఇమ్రాన్‌ తెలిపాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు  తా ము సహకరించినట్లు రెంజల్‌ ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు. ఇద్దరిపై ఉత్తర్‌ ప్రదేశ్‌లో కిడ్నాప్‌ కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-08-14T17:43:14+05:30 IST