ఇద్దరు నర్సులు, ముగ్గురు ఎంఎన్‌వోల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-05-15T06:34:12+05:30 IST

ఏలూరు జిల్లా కేంద్ర ప్రభు త్వాసుపత్రిలో రెమెడిసెవర్‌ ఇంజక్షన్లను తస్కరించిన ఇద్దరు నర్సులతోపాటు ఒక ఎంఎన్‌వోను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఇద్దరు నర్సులు, ముగ్గురు ఎంఎన్‌వోల సస్పెన్షన్‌


ఏలూరు క్రైం, మే 14 : ఏలూరు జిల్లా కేంద్ర ప్రభు త్వాసుపత్రిలో రెమెడిసెవర్‌ ఇంజక్షన్లను తస్కరించిన ఇద్దరు నర్సులతోపాటు ఒక ఎంఎన్‌వోను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి కే ఈ ఇంజక్షన్ల ముఠాను టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో స్టాఫ్‌ నర్స్‌ మన్నం లావణ్య, కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌ రాయల వెంకటలక్ష్మి, కాంట్రాక్ట్‌ ఎం ఎన్‌వో బొమ్మకంటి రవి బ్రహ్మయ్యలను సస్పెండ్‌ చేస్తూ శుక్రవా రం ఆదేశాలు జారీచేశారు. వీరితోపాటు కొవిడ్‌ విధులు నిర్వర్తిస్తోన్న మరో ఇద్దరు ఎంఎన్‌వోలు ఆసుపత్రిలోని ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పిస్తామని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఎంఎన్‌వోలు రామకృష్ణ, లోకేష్‌లను సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. 


Updated Date - 2021-05-15T06:34:12+05:30 IST