వెంటాడుతున్న కరోనా భయం

ABN , First Publish Date - 2020-05-20T10:17:16+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపులతో ఊరట చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను కరోనా భయం వెంటాడు తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతుం

వెంటాడుతున్న కరోనా భయం

సిరిసిల్ల జిల్లాలో మరో రెండు పాజిటివ్‌ 

వలస కార్మికుల రాకతో ఆందోళన 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): లాక్‌డౌన్‌ సడలింపులతో ఊరట చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను కరోనా భయం వెంటాడు తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతుం డడంతో ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర నుం చి వలస వస్తున్న వారిలో కరోనా లక్షణాలు కనిపి స్తుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం ముంబై నుంచి వచ్చి న ఇద్దరు వలస కూలీలకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ముంబై నుంచి వేములవాడ మండలం నాగయ్యపల్లికి ఈ నెల 14న దంపతులు వచ్చారు. వారిని ఒక పాఠశాలలో క్వారంటైన్‌లో ఉంచారు. ఈ నెల 17న దంపతుల్లో భర్తకు పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం భార్య శాంపిళ్లను పరీక్షలకు పం పించగా ఆమెకు కూడా పాజిటివ్‌గా తేలింది. వేము లవాడ అర్బన్‌ మండలం రుద్రవరం గ్రామానికి చెం దిన వలస కూలీకి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలకు పంపగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.


వారం రోజుల క్రితం అతడి మామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ముంబై నుంచి శాత్రాజుపల్లికి వచ్చాడు. ఇప్పటి వరకు  మహారాష్ట్ర నుంచి 618 మంది జిల్లాకు వచ్చారు. వీరిలో నలుగురికి పాజి టివ్‌ వచ్చింది. వేములవాడలో ముగ్గురు, సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేటలో ఒకరు ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏడుగురికి కరోనా పాజిటివ్‌ తేలింది.


ఇందులో గత నెల వేములవాడ నుంచి మర్కజ్‌కు వెళ్లివచ్చిన ముగ్గురికి పాజిటివ్‌ రాగా  వారు చికిత్స పొందారు.  తాజాగా వలస కూలీలతో పల్లెల్లో కరోనా భయం  నెలకొంది. పాజి టివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలను అధికారులు కట్టడి చేశారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహి స్తున్నారు.  వలస కార్మికులు వచ్చిన గ్రామాల్లోనూ సర్వే చేస్తున్నారు. 


Updated Date - 2020-05-20T10:17:16+05:30 IST