‘ఫ్లాట్ ట్రేడింగ్: ఫోకస్‌’లో... రిలయన్స్ రెండు శాతం లాభం...

ABN , First Publish Date - 2021-11-25T22:55:58+05:30 IST

‘మార్కెట్’లో బలహీనత స్పష్టంగా కన్పిస్తోంది. నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతుండగా, ఐటీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఓ మాదిరి లాభాల్లో ప్రారంభం అయ్యాయి.

‘ఫ్లాట్ ట్రేడింగ్: ఫోకస్‌’లో... రిలయన్స్ రెండు శాతం లాభం...

ముంబై : ‘మార్కెట్’లో బలహీనత స్పష్టంగా కన్పిస్తోంది. నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతుండగా, ఐటీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఓ మాదిరి లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఆటో, టెక్ షేర్ల పరిస్థితి కూడా డిటో.  మిగిలిన రంగాల్లోనూ ఇదే రకమైన ట్రెండ్ కొనసాగుతోంది. అయితే అటు లాభం కానీ, ఇటు నష్టం కానీ ఓ మాదిరిగానే చోటు చేసుకోవడం ఓపెనింగ్ సెషన్ హైలైట్. ఎర్లీ టాప్ గెయినర్లలో యూపీఎల్, రిలయన్స్,కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. లూజర్లలో ఐసీఐసీఐ బ్యాంక్,ఐషర్ మోటర్స్, శ్రీ సిమెంట్స్, ఎన్‌టీపీసీ, ఐఓసీ,,, రెండు నుంచి అర శాతం వరకూ నష్టపోయాయి.  వ్యాపారం అంతటినీ రీస్ట్రక్చరింగ్ చేయబోతున్నట్లు రిలయన్స్ లీకులు ఇవ్వడంతో... ఈ కౌంటర్‌ ఈ రోజు ఉత్తేజంగా ఉంది. 

Updated Date - 2021-11-25T22:55:58+05:30 IST