Advertisement
Advertisement
Abn logo
Advertisement

లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

అనంతపురం : చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని నాగ సముద్రం గేట్ వద్ద గల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు వైపు వెళ్తూ ఓవర్ టేక్ చేస్తున్న సమయం లారీని వెనుక వైపు నుంచి కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.


Advertisement
Advertisement