Abn logo
May 28 2020 @ 06:35AM

స్పైస్ జెట్ విమానంలో మరో ఇద్దరు ప్రయాణికులకు కరోనా

న్యూఢిల్లీ : అహ్మదాబాద్ నుంచి గువహటి నగరానికి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని విమానయాన సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. గువహటి విమానాశ్రయానికి వచ్చిన స్పైస్ జెట్ విమానంలో ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకడంతో విమానంలోని ప్రయాణికులందరినీ క్వారంటైన్ కు తరలించారు. కరోనా బాధిత ప్రయాణికులు అహ్మదాబాద్- డిల్లీ ఎస్ జి -8194 , ఢిల్లీ -గువహటి ఎస్ జి-8152 స్పైస్ జెట్ విమానాల్లో ప్రయాణించారని విమానయాన అధికార ప్రతినిధి చెప్పారు. కరోనా రోగులున్న విమానం నడిపిన స్పైస్ జెట్ విమాన సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా ప్రబలకుండా ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటిస్తూ విమానాలను శానిటైజ్ చేస్తున్నామని స్పైస్ జెట్ ప్రకటించింది. కరోనా బాధితులు విమానాల్లో ప్రయాణిస్తున్నందు వల్ల తాము విమానం సీటు కవర్లు, సీటు బెల్టులు, కిటికీలు, మరుగుదొడ్లను శానిటైజ్ చేస్తున్నామని స్పైస్ జెట్ అధికారప్రతినిధి వివరించారు.  

Advertisement
Advertisement
Advertisement