ఒకేరోజు రెండు సర్‌ప్రైజెస్..!

ఒకేరోజు రెండు భారీ చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చి సర్‌ప్రైజ్ చేయబోతున్నాయనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ చిత్రాలే 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప'. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియన్ రేంజ్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒక చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి..ఒక చిత్రానికి సుకుమార్ దర్శకులు. 'ఆర్ఆర్ఆర్' మూవీలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్‌లతో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ అలాగే ఓలివియా మోరీస్, సముద్రఖని వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక 'పుష్ప' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే, డిసెంబర్ 3న 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్  ప్రకటించారు. 

కానీ, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల మరణంతో ట్రైలర్ లాంచ్ వాయిదా వేశారు. మళ్ళీ ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 6న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక అదేరోజు 'పుష్ప' మూవీ నుంచి కూడా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయాలని టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే అభిమానులకు, ప్రేక్షకులను డబుల్ ధామాకానే. కానీ, అదే సమయంలో రెండు ట్రైలర్స్‌ను కంపేర్ చేసి కామెంట్స్ చేసే అవకాశమూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇప్పటికే 'పుష్ప' చిత్రాన్ని డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా, 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Advertisement
Advertisement