రోజూ 2 వేల శాంపిళ్లు పరీక్షించాలి

ABN , First Publish Date - 2020-06-05T09:54:40+05:30 IST

జిల్లావ్యాప్తంగా రోజూ 2వేల కొవిడ్‌-19 శాంపిళ్లు తీసి, పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు..

రోజూ 2 వేల శాంపిళ్లు పరీక్షించాలి

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం అర్బన్‌, జూన్‌ 4: జిల్లావ్యాప్తంగా రోజూ 2వేల కొవిడ్‌-19 శాంపిళ్లు తీసి, పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మీనీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కొవిడ్‌-19పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో శాంపిళ్ల సేకరణ బృందాలు రోజూ 2 వేలు తీసుకోవాలన్నారు. వీటికి జిల్లాలో వెయ్యి, తిరుపతిలో వెయ్యి టెస్టులు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో జిల్లాలో శాంపిల్‌ కలెక్షన్‌, టెస్టింగ్‌ను వేగవంతం చేయాలన్నారు. కొవిడ్‌ ఆర్డర్‌ 54 ప్రకారం జిల్లాలో 60 సంవత్సరాలు పైబడినవారు, వలస కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి ఇతర 15 రకాల కేటగిరీల వారికి టెస్టులు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహించాలన్నారు. సేకరించిన శాంపిళ్లకు 45 గంటలలోపు టెస్టింగ్‌ చేయాలన్నారు.


జిల్లాలో కొడికొండ, తూంకుంట, విడపనకల్లు తదితర చెక్‌పో్‌స్టల్లో శాంపిళ్లను సేకరించాలన్నారు. నోడల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్‌ఏఆర్‌ఐ, ఐఎల్‌ఐ కేసులకు టెస్టింగ్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌ ఉంచకూడదన్నారు. ఆస్పత్రుల సంసిద్ధతపై పూర్తి దృష్టి పెట్టాలని నోడల్‌ అధికారి వరప్రసాద్‌ను ఆదేశించారు. ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి ఆర్డీటీ ఆస్పత్రిలో మూడు లైన్స్‌ ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు ఆరుండగా ప్రభుత్వం మరో 36 బెడ్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఐసీయూ 60, నాన్‌ ఐసీ యూ బెడ్లు 400, ఏరియా ఆస్పత్రుల్లో గుంతకల్లు, కదిరి 20 బెడ్లు, సింగిల్‌ లైన్‌కింద 80 చొప్పున బెడ్లు మంజూరై నట్లు తెలిపారు. వాటిని వేగంగా ఏర్పాటు చేసేలా చర్య లు తీసుకోవాలని వరప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీలు నిశాంత్‌కుమార్‌, సిరి, జేసీ-2 పద్మావతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ప్రభుత్వ సర్వజ నాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ రమే్‌షనాథ్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజతో పాటు నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-05T09:54:40+05:30 IST