Pulwama encounter: ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-07-31T15:23:23+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా అడవుల్లో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని....

Pulwama encounter: ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదుల హతం

పుల్వామా(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని పుల్వామా అడవుల్లో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. పుల్వామా జిల్లాలోని నాగ్ బెరాన్-తర్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య దాచిగాం అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు  గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ జోన్ పోలీసులు శనివారం ట్వీట్ చేశారు.జమ్మూకశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతాగాలకు చెందిన జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఉగ్రవాదుల సంచారం పెరగడంతో జమ్మూకశ్మీరులో తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Updated Date - 2021-07-31T15:23:23+05:30 IST