రెండు యోనులు, రెండు గర్భాశయాలు... క్లిష్ట పరిస్థితుల్లో శిశు జననం!

ABN , First Publish Date - 2020-02-20T16:37:16+05:30 IST

అమెరికాలోని మిచిగన్‌కు చెందిన ఒక మహిళ‌కు రెండు యోని ద్వారాలు, రెండు గర్భాశయాలు, రెండు గర్భాశయ గ్రీవాలు ఉన్నాయి. ఆమె గర్భందాల్చినప్పుడు ఈ విషయం తెలియగానే ఆమె...

రెండు యోనులు, రెండు గర్భాశయాలు... క్లిష్ట పరిస్థితుల్లో శిశు జననం!

న్యూయార్క్: అమెరికాలోని మిచిగన్‌కు చెందిన ఒక మహిళ‌కు రెండు యోని ద్వారాలు, రెండు గర్భాశయాలు, రెండు గర్భాశయ గ్రీవాలు ఉన్నాయి. ఆమె గర్భందాల్చినప్పుడు ఈ విషయం తెలియగానే ఆమె తీవ్రమైన ఆందోళనకు గురైంది. అయితే ఆమె ఆరోగ్యంతో కూడిన ఒక బిడ్డకు జన్మనివ్వడం విశేషం. 25 ఏళ్ల బిథానీ మెక్‌మిలన్ శరీరంలో ఇటువంటి సమస్యను గుర్తించిన వైద్యులు ముందుగా కంగుతిన్నారు. మెడికల్ పరిభాషలో ఇటువంటి స్థితిని ‘యుట్రెస్ డిడ్లేఫిస్’ అని అంటారు. ఈ సందర్భంగా బిథానీ మెక్‌మిలన్ మాట్లాడుతూ 2018లో తనకు తొలిసారి గర్భస్రావం జరిగిందని తెలిపింది. అలాగే అప్పట్లో వైద్యులు తన ఆరోగ్య పరిస్థితిని గమనించి తన గర్భంలో ఆరు నెలలకు మించి శిశువు ఎదిగే పరిస్థితి లేదన్నారు. దీంతో మరోసారి గర్భం దాలిస్తే మళ్లీ గర్భస్రావం జరుగుతుందేమోనని భయపడ్డాను. ఒకరోజు రొటీన్ చెకప్ కోసం గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె నన్ను పరీక్షించి ఆశ్చర్యపోయారు. నా శరీరంలో కొన్ని అవయవాలు రెండేసి ఉన్నాయని తెలిపారు. అప్పటికే ఆందోళనలో ఉన్న నేను మరింత కుంగిపోయాను. నాకు పుట్టుకతోనే రెండు యోని ద్వారాలు, రెండు పిండాలు, రెండు గర్భాశయాలు, రెండు గర్భాశయ గ్రీవాలు ఉన్నాయని అప్పుడు తెలిసింది. ఏడాది తరువాత మరోమారు నేను గర్భందాల్చాను. అయితే అత్యంత విపత్కర పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిచ్చాను. నా గారాలపట్టికి మాఇవ్ అనే పేరు పెట్టుకున్నాను. పాపకు ఇప్పుడు 5 మాసాలు... ’అని తన అనుభవాలను తెలియజేసిన బిథానీ మెక్‌మిలన్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 


Updated Date - 2020-02-20T16:37:16+05:30 IST