Abn logo
Jun 12 2021 @ 00:36AM

రెండు వాహనాల ఢీ: ఒకరి మృతి

మదనపల్లె టౌన్‌, జూన్‌ 11: ఎదురెదురుగా వస్తున్న రెండు లగేజి వాహనాలు ఢీ కొన్న ప్రమా దంలో ఒకరు మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం మదన పల్లె శివారులోని బైపాస్‌రోడ్డులో జరిగిన ఈ ప్రమాదానికి సంబం ధించి పోలీసుల కథనం మేరకు.. వి.కోట నుంచి మదనపల్లెకు టమో టాలను తీసుకొచ్చిన మంజునాథ్‌ (37), చలపతి(40) మదనపల్లె మార్కెట్‌లో టమోటాలను దించి ఖాళీ క్రేట్లతో తిరిగి వి.కోటకు బయలు దేరాడు. మదనపల్లె బైపాస్‌ రోడ్డులో వెళ్తుండగా పుంగనూరు మండల ఈడిగపల్లె నుంచి టమోటా, మామిడి కాయల లోడుతో మదన పల్లె వస్తున్న మరో లగేజీ వాహనం బసినికొండ వద్ద  మంజునాథ్‌  వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం బోల్తాపడగా మంజునాథ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న నిమ్మనపల్లె 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంజునాథ్‌ మృతి చెందగా, మరో వాహనంలోని మదనపల్లె పట్టణం రామా రావుకాలనికి చెందిన ఆర్‌.సురేంద్ర(32), పుంగనూరు మండలం నేతిగుంటపల్లెకు చెం దిన బి.శ్రీనివాసులు(40), వెంకటరమణ(39), చలపతి గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే పెట్రోలింగ్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. కాగా మృతి చెందిన మంజునాథ్‌ స్వగ్రామం కర్ణాటక రాష్ట్రం ముళబాగిల్‌ కాగా వి.కోటకు కూలీపనుల నిమిత్తం వచ్చాడు. మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement