Abn logo
Sep 13 2021 @ 21:00PM

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

జోగులాంబ గద్వాల: జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గద్వాల పట్టణంలోని బండ బావిలో ఈతకు వెళ్లి అహ్మద్(12) అనే  బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


జిల్లాలోని వడ్డేపల్లి మండలం జూలకల్లు దగ్గర బైక్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అన్నదమ్ములలో అన్న అజిత్(17) మృతి చెందాడు. తమ్ముడికి తీవ్ర గాయాలు అయ్యాయి.  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


క్రైమ్ మరిన్ని...