సర్వీసింగ్‌కి వచ్చిన వాహనాలతో చోరీలు... మెకానిక్ అరెస్ట్!

ABN , First Publish Date - 2021-01-21T04:52:45+05:30 IST

సర్వీసింగ్ కోసం గ్యారేజీకి వచ్చిన వాహనాలతో రోడ్లపై తిరుగుతూ ఓ మోటార్ మెకానిక్ సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడిన వైనమిది...

సర్వీసింగ్‌కి వచ్చిన వాహనాలతో చోరీలు... మెకానిక్ అరెస్ట్!

ముంబై: సర్వీసింగ్ కోసం గ్యారేజీకి వచ్చిన వాహనాలతో రోడ్లపై తిరుగుతూ ఓ మోటార్ మెకానిక్ సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడిన వైనమిది. ముంబై శివారు ప్రాంతమైన అంధేరిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు. నిందితుడిని 26 ఏళ్ల అష్రాఫ్ షేక్‌గా గుర్తించారు. అతడు రాత్రివేళల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో మోటార్ బైక్ ఉపయోగించి చోరీలు చేసినట్టు స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అష్రాఫ్‌ను పసిగట్టి పట్టుకోవడంతో అతడి ఆగడాలకు చెక్ పడింది. అతడి వద్ద నుంచి పోలీసులు అత్యంత విలువైన 11 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 394 కింద అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2021-01-21T04:52:45+05:30 IST