రెండేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

ABN , First Publish Date - 2021-10-21T16:22:19+05:30 IST

బహుళ అవయవ వైఫల్యం కారణంగా కోమాలోకి జారుకున్న కేరళకు చెందిన రెండేళ్ల బాలుడు రేలా ఆస్పతి వైద్యులు అందించిన చికిత్సతో కోలుకున్నాడు. కేరళకు చెందిన అధ్విక్‌ అనే బాలుడు తీవ్రమైన శ్వా

రెండేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

చెన్నై(tamilnadu): బహుళ అవయవ వైఫల్యం కారణంగా కోమాలోకి జారుకున్న కేరళకు చెందిన రెండేళ్ల బాలుడు రేలా ఆస్పతి వైద్యులు అందించిన చికిత్సతో కోలుకున్నాడు. కేరళకు చెందిన అధ్విక్‌ అనే బాలుడు తీవ్రమైన శ్వాసకోశ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌తో బాధపడేవాడు. ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా పలితం లేకపోవడంతో తల్లిదండ్రులు అతనిని ఇటీవల రేలా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అతను కోమాలోకి వెళ్లిపోయాడు. డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ అరుముగం నేతృత్వంలోని వైద్యబృందం అతనిని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌కేర్‌లో వుంచి చికిత్స అందించారు. తొలుత వెంటిలేటర్‌పై, ఆ తరువాత ఎక్మోపై వుంచాల్సివచ్చింది. అయితే వైద్యుల కృషితో అతను పది రోజులకే ఎక్మో నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం కోలుకుని క్షేమంగా వున్నాడని ఆస్పత్రి చైర్మన్‌ మహమ్మద్‌ రేలా నేతృత్వంలోని వైద్య బృందం బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించింది. బాలుడి తల్లిదండ్రులు ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-10-21T16:22:19+05:30 IST