గర్ల్‌ఫ్రెండ్స్‌కు కొత్త మొబైల్స్ ఇవ్వాలని.. పెద్ద ప్లాన్ వేసిన ఫ్రెండ్స్..

ABN , First Publish Date - 2021-01-16T00:14:49+05:30 IST

‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు.. అయ్యో పాపం పసివాడు..’ అనే పాట గుర్తుందా. ఇదిగో ఈ స్నేహితులు కూడా అలాగే ప్రేమ కోసం అడ్డదార్లు తొక్కి దొరికిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయడం కోసం ఇద్దరు మిత్రులు పెద్ద ప్లాన్ వేశారు.

గర్ల్‌ఫ్రెండ్స్‌కు కొత్త మొబైల్స్ ఇవ్వాలని.. పెద్ద ప్లాన్ వేసిన ఫ్రెండ్స్..

పూణే: ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు.. అయ్యో పాపం పసివాడు..’ అనే పాట గుర్తుందా. ఇదిగో ఈ స్నేహితులు కూడా అలాగే ప్రేమ కోసం అడ్డదార్లు తొక్కి దొరికిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయడం కోసం ఇద్దరు మిత్రులు పెద్ద ప్లాన్ వేశారు. తమ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కు కొత్త మొబైల్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఆ మొబైల్స్ కొనడానికి తమ వద్ద డబ్బులు లేవు. దీంతో ఎక్కడ దొరికితే అక్కడ మొబైల్స్ చోరీ చేశారు. ఇలా మొత్తమ్మీద 26 మొబైల్స్ దొంగతనం చేశారు. వీటి విలువ సుమారు 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. ఇలా దొంగిలించిన ఫోన్లను గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఇచ్చి వాళ్ల పాత ఫోన్లను అమ్మేసుకోవడం మొదలు పెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మూడు మోటార్ బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-01-16T00:14:49+05:30 IST