రేపు టైప్‌ రైటింగ్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-19T11:35:53+05:30 IST

టైప్‌ రైటింగ్‌ పరీక్షలు ఈనెల 20న నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది

రేపు టైప్‌ రైటింగ్‌ పరీక్షలు

హైదరాబాద్, కుషాయిగూడ (ఆంధ్రజ్యోతి): టైప్‌ రైటింగ్‌ పరీక్షలు ఈనెల 20న నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేసింది. ఈనెల 27, అక్టోబర్‌ 4 తేదీల్లో షార్ట్‌ హ్యాండ్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం లోయర్‌, మధ్యాహ్నం హయ్యర్‌ గ్రేడ్‌ బ్యాచ్‌లకు పరీక్షలు ఉంటాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. మాసాబ్‌ ట్యాంక్‌, మారేడ్‌పల్లి, రామంతాపూర్‌, అమీ ర్‌పేట్‌ దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ పరీక్షా కేంద్రాలున్నాయి. 

Updated Date - 2020-09-19T11:35:53+05:30 IST