Philippinesకు తుపాన్ ముప్పు...45వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ABN , First Publish Date - 2021-12-17T14:06:08+05:30 IST

ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసిన టైఫూన్ రాయ్ దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని సియార్‌గావ్ ద్వీపంలో తీరాన్ని తాకినట్లు ఫిలిప్పీన్స్ వాతావరణ బ్యూరో తెలిపింది...

Philippinesకు తుపాన్ ముప్పు...45వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

మనీలా: ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసిన టైఫూన్ రాయ్ దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని సియార్‌గావ్ ద్వీపంలో తీరాన్ని తాకినట్లు ఫిలిప్పీన్స్ వాతావరణ బ్యూరో తెలిపింది.ఆకస్మిక వరదలు, తుపాను ముప్పు కారణంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని 45,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ వల్ల గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని స్థానికులు చెప్పారు.ఈ తుపాన్ వల్ల భారీవర్షాలు కురుస్తున్నాయని ఫిలప్పీన్స్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.ఈ తుపాన్ శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం ఉత్తర లేదా మధ్య పలావాన్ ప్రావిన్స్‌ను దాటుతుందని అంచనా వేశారు.ఆకస్మిక వరదలు, తుఫాను ముప్పు కారణంగా తీరప్రాంత గ్రామాలతో సహా సెంట్రల్ ఫిలిప్పీన్స్, ఉత్తర మిండానావోలో 45,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ మండలి తెలిపింది.


ప్రావిన్స్‌తో కూడిన 23 పట్టణాలలో 21 నుంచి దాదాపు 30,000 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తూర్పు సమర్ ప్రావిన్స్ గవర్నర్ బెన్ ఎవర్డోన్ తెలిపారు.టైఫూన్ ముప్పు కారణంగా సెంట్రల్ ఫిలిప్పీన్స్, బికోల్ ప్రాంతం, ఈశాన్య మిండనావోలో 1,800 రోలింగ్ కార్గోలు, 80కి పైగా నౌకలు చిక్కుకుపోయాయని ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.

Updated Date - 2021-12-17T14:06:08+05:30 IST