boxing: టైసన్ ఫ్యూరీకి కరోనా..బాక్సింగ్ పోటీ వాయిదా

ABN , First Publish Date - 2021-07-16T16:04:21+05:30 IST

బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్ టైసన్ ఫ్యూరీకి కరోనా సోకడంతో ఈ నెల 24 నుంచి జరగాల్సిన హెవీవెయిట్ బాక్సింగ్ పోటీలు వాయిదా...

boxing: టైసన్ ఫ్యూరీకి కరోనా..బాక్సింగ్ పోటీ వాయిదా

లండన్ : బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ బాక్సర్ టైసన్ ఫ్యూరీకి కరోనా సోకడంతో ఈ నెల 24 నుంచి జరగాల్సిన హెవీవెయిట్ బాక్సింగ్ పోటీలు వాయిదా వేశారు. టైసన్ ఫ్యూరీ జులై 24న డియోంటె వైల్డర్ తో తలపడాల్సి ఉంది. టైసన్ ఫ్యూరీకి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో బాక్సింగ్ పోటీలను జులై 24 నుంచి అక్టోబరు 9వతేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రమోటర్లు ప్రకటించారు. టైసన్ ఫ్యూరీ వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ కిరీటం కోసం లాస్ వెగాస్ లో పోరాడనున్నారు. తాను అక్టోబరు 9న పోరాటానికి వర్క్ అవుట్లు చేస్తున్నానని టైసన్ ఫ్యూరీ చెప్పారు. 


Updated Date - 2021-07-16T16:04:21+05:30 IST