UAE సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి అమలు..

ABN , First Publish Date - 2021-12-08T13:02:09+05:30 IST

అధికారిక పని దినాలను కుదిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వారాంతపు సెలవు దినాలను కూడా సవరించింది. కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వారానికి నాలుగున్నర రోజులే అధికారిక పని దినాలు ఉంటాయి. మూడున్నర రోజులు సెలవు. ఇప్పటి వరకూ ముస్లీంల ప్రార్థనల కోసం..

UAE సంచలన నిర్ణయం.. జనవరి 1 నుంచి అమలు..

యూఏఈలో ఇక శని, ఆదివారాలు సెలవు

దుబాయ్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): అధికారిక పని దినాలను కుదిస్తూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వారాంతపు సెలవు దినాలను కూడా సవరించింది. కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వారానికి నాలుగున్నర రోజులే అధికారిక పని దినాలు ఉంటాయి. మూడున్నర రోజులు సెలవు. ఇప్పటి వరకూ ముస్లీంల ప్రార్థనల కోసం శుక్రవారం పూర్తిగా సెలవు దినంగా పరిగణించేవారు. ఇకపై శుక్రవారం మధ్యాహ్నం 12గంటల నుంచి సెలవు ఇస్తారు. అవసరమైతే ఆ రోజున ఇంటి నుంచే  విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించారు. ఏడాది పొడవునా శుక్రవారం మధ్యా హ్నం నమాజు వేళను 1.15గా నిర్ణయించారు. సోమవారం తిరిగి విధులకు రావాల్సి ఉంటుంది. పోటీ తత్వాన్ని మెరుగుపరచే లక్ష్యంతోపాటు ప్రపంచ మార్కెట్లు, వాణిజ్యాన్ని పరిగణనలోకి తీసుకొని వారాంతాన్ని శని, ఆదివారాలకు మార్పు చేశారని అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-12-08T13:02:09+05:30 IST