'క‌రోనా' కోర‌ల్లో యూఏఈ.‌..

ABN , First Publish Date - 2020-06-05T15:51:32+05:30 IST

క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని యూఏఈ విల‌విల్లాడుతోంది.

'క‌రోనా' కోర‌ల్లో యూఏఈ.‌..

యూఏఈ: క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని యూఏఈ విల‌విల్లాడుతోంది. యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి‌ రోజురోజుకీ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. గురువారం ఒక్క‌రోజే 659 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 37,018కి చేరింద‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అలాగే 419 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,572కి చేరింది. అలాగే గురువారం సంభ‌వించిన మూడు మ‌ర‌ణాల‌తో‌ క‌లిపి ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్‌తో మృతి చెందిన‌ వారు 273 మంది అయ్యారు. మ‌రో 17,173 మంది కోవిడ్ బాధితులు దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.  


ఇక ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా కొవిడ్‌ టెస్టులు ముమ్మ‌రం చేసిన యూఏఈ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా 2 మిలియ‌న్‌కు పైగా మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. గురువారం కూడా దేశ వ్యాప్తంగా 54,000 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి 3.90 ల‌క్ష‌ల మందిని పొట్ట‌నుబెట్టుకుంది. 67 ల‌క్ష‌ల‌కు పైగా మంది బాధితులు ఉన్నారు.  

Updated Date - 2020-06-05T15:51:32+05:30 IST