UAE వెళ్తున్నారా? అయితే కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్‌పై ఓ లుక్కేయండి!

ABN , First Publish Date - 2021-10-28T14:55:14+05:30 IST

యూఏఈ వెళ్తున్నవారు ఆ దేశ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ), జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) తాజాగా ప్రకటించిన ట్రావెల్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోవడం బెటర్.

UAE వెళ్తున్నారా? అయితే కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్‌పై ఓ లుక్కేయండి!

అబుధాబి: యూఏఈ వెళ్తున్నవారు ఆ దేశ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ), జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) తాజాగా ప్రకటించిన ట్రావెల్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోవడం బెటర్. ఈ కొత్త నిబంధనలు బుధవారం(అక్టోబర్ 27) నుంచి అమలులోకి వచ్చాయి. యూఏఈ ప్రకటించిన కొత్త ట్రావెల్ ప్రోటోకాల్స్ ప్రకారం.. 

1. రెండు డోసుల కరోనా టీకా వేసుకున్న వారు మాత్రమే ఆ దేశానికి వెళ్లడానికి అర్హులు.

2. రోగులు, స్కాలర్షిప్‌లపై విదేశాలలో చదువుతున్న వారు, మానవతావాద కేసులు, యూఏఈ దౌత్య కార్యకలాపాలు నిర్వహించేవారు తదితరులు ముందుస్తుగా అధికారుల నుంచి అనుమతి పొందితే యూఏఈ వెళ్లొచ్చు.

3. ప్రయాణికులు తప్పనిసరిగా జర్నీకి 48 గంటల ముందు చేయించుకున్న పీసీఆర్ టెస్టు నెగెటిటి సర్టిఫికేట్ చూపించాలి. అది కూడా క్యూఆర్ కోడ్‌తో ఉండాలి.  

4. టీకా వేయించుకున్న ప్రయాణికులు యూఏఈ చేరుకున్న వెంటనే పీసీఆర్ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

5. అలాగే అక్కడికెళ్లిన నాల్గు, ఎనిమిదో రోజున మళ్లీ రెండుసార్లు పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. 

6. వ్యాక్సిన తీసుకోని ప్రయాణికులు యూఏఈ చేరుకున్న తక్షణమే పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. తొమ్మిదో రోజున మరోసారి పీసీఆర్ పరీక్ష ఉంటుంది. 

7. 'Tawajudi' సర్వీసులో ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా తాజా ప్రోటోకాల్ వివరాలు, తమ అర్హతలను చెక్ చేసుకోవచ్చు.  

8. 70 ఏళ్లకు పైబడిన వృద్ధులు తమ ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2021-10-28T14:55:14+05:30 IST