యూఏఈలో సంబరాలు.. చరిత్రలో నిలిచిపోనున్న ‘చివరి పనిదినం’!

ABN , First Publish Date - 2021-12-26T23:03:06+05:30 IST

యూఏఈలో ఈ ఆదివారం(నేడు) చివరి పని దినంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాబోయే ఆదివారాలన్ని సెలవులే అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

యూఏఈలో సంబరాలు.. చరిత్రలో నిలిచిపోనున్న ‘చివరి పనిదినం’!

ఇంటర్నెట్ డెస్క్: శని, ఆదివారాలంటే వీకెండ్. వారం మొత్తం కష్టపడి.. ఆ రెండు రోజులు సేద తీరే సమయం. ఆ రెండు రోజులు కుటుంబంతో సహా అలా షికారుకెళ్లిరావచ్చు.. లేదా స్నేహితులను కలవచ్చు. కానీ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రజలు మాత్రం ఇప్పటివరకూ ఆదివారం సరదాలకు దూరంగానే ఉంటూవచ్చారు. అక్కడ శుక్ర, శనివారాల్లో వారాంతపు సెలవలు ఉండటంతో ఆదివారం తమ రోజు వారి విధుల్లో మునిగిపోయేవారు. కానీ..అక్కడి ప్రభుత్వం ఇటీవలే శని, ఆదివారాలను వారాంతపు సెలవుగా ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే యూఏఈలో వీకెండ్ మొదలుకానుంది. 


వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. దీంతో.. యూఏఈలో ఈ ఆదివారం(నేడు) చివరి పని దినంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాబోయే ఆదివారాలన్నీ సెలవులే అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర దేశాల వారు కూడా యూఏఈ ప్రజల సంతోషంలో భాగం పంచుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచీ ఆదివారం అంటే ఆటవిడుపే అంటూ సోషల్ మీడియా వేదికగా యూఏఈ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Updated Date - 2021-12-26T23:03:06+05:30 IST