భార‌త టీకాపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన యూఏఈ!

ABN , First Publish Date - 2021-06-22T15:50:42+05:30 IST

భార‌త్‌లో కొవిషీల్డ్ పేరిట‌ విక్ర‌యించ‌బడుతున్న ఆక్స్‌ఫ‌ర్డ్‌-అస్ట్రాజెనెకా టీకాపై తాజాగా యూఏఈ స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఈ వ్యాక్సిన్ యూఏఈ ఆమోదం పొందిన‌దిగా దుబాయ్ హెల్త్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది.

భార‌త టీకాపై స్ప‌ష్ట‌త‌నిచ్చిన యూఏఈ!

అబుధాబి: భార‌త్‌లో కొవిషీల్డ్ పేరిట‌ విక్ర‌యించ‌బడుతున్న ఆక్స్‌ఫ‌ర్డ్‌-అస్ట్రాజెనెకా టీకాపై తాజాగా యూఏఈ స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఈ వ్యాక్సిన్ యూఏఈ ఆమోదం పొందిన‌దిగా దుబాయ్ హెల్త్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. కొవిషీల్డ్ టీకా తీసుకున్న‌ ప్ర‌యాణికులు ఎలాంటి సందేహం లేకుండా భార‌త్ నుంచి యూఏఈకి రావొచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న‌వారు భార‌త్ నుంచి యూఏఈ వ‌స్తే క‌రోనా టీకా తీసుకున్న‌ట్లు గుర్తిస్తారా? లేదా? అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌వాసులు వ్య‌క్తం చేసిన‌ సందేహాల‌ను యూఏఈ స‌ర్కార్ తాజాగా నివృత్తి చేసింది. కొవిషీల్డ్ టీకా యూఏఈ ఆమోదించిన క‌రోనా వ్యాక్సిన్‌గా ఆ దేశ అధికారులు స్ప‌ష్టం చేశారు. తాజా ప్ర‌యాణ ప్రోటోకాల్ ప్ర‌కారం భార‌త ప్ర‌యాణికుల‌ను యూఏఈ ప్ర‌వేశించ‌డానికి అనుమ‌తి ఇస్తామ‌ని తెలిపారు. ఇక గ‌త శ‌నివారం భార‌త్‌కు విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభిస్తున‌ట్లు యూఏఈ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.   

Updated Date - 2021-06-22T15:50:42+05:30 IST