Advertisement
Advertisement
Abn logo
Advertisement

వలస కార్మికుల కోసం దుబాయ్ బంపర్ ఆఫర్

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశంలోని దుబాయ్, అబుధాబి రాజ్యాలలో కొన్ని కంపెనీలు వలస కార్మికులకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చయి. వీరి కోసం కొన్ని ఏజెన్సీల ద్వారా ఉచిత రిక్రూటింగ్‌ చేపట్టాయి. గతంలో గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే వారి నుంచి జాబ్ ఏజెన్సీలు వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసేవి. 


కరోనా కారణంగా దుబాయ్ కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను వారి దేశాలకు పంపించడంతో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దాంతో వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. ఇన్నాళ్లు బోసిపయిన దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టులు.. మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ విమానాశ్రయాలలో క్లీనింగ్‌ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులకు వీసాలు జారీ చేస్తున్నాయి. 


తెలంగాణలోని జగిత్యాల్, నిజామాబాద్, ఆర్మూర్‌లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్‌ కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలు సర్వీస్‌ చార్జీగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్‌లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో ఇంటర్వ్యూలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement