యూఏఈ అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. 870 మంది ఖైదీలకు స్వేఛ్చ.. వారి అప్పులు తీర్చి.. జరిమానాలు రద్దు చేసి..

ABN , First Publish Date - 2021-11-29T02:28:50+05:30 IST

ప్రతి ఏటా డిసెంబర్ 2న యూఏఈ ప్రభుత్వం జాతీయ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరగబోయే వేడుకలను పురస్కరించుకుని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ మహ్మద్ జాయెద్ అల్ నహ్యాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

యూఏఈ అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. 870 మంది ఖైదీలకు స్వేఛ్చ..  వారి అప్పులు తీర్చి.. జరిమానాలు రద్దు చేసి..

ప్రతి ఏటా డిసెంబర్ 2న యూఏఈ ప్రభుత్వం జాతీయ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరగబోయే వేడుకలను పురస్కరించుకుని యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ మహ్మద్ జాయెద్ అల్ నహ్యాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి జైళ్లలో మగ్గుతున్న 870 మంది ఖైదీలకు స్వేచ్ఛ కల్పించారు. వారి అప్పులను, చెల్లించాల్సిన జరిమానాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యూఏఈ ఆవిర్భించి 49 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. 1972, డిసెంబర్ 2న చివరి ఎమిరేట్ రస్‌ అల్ ఖైమా కూడా యూఏఈ ఫెడరేషన్‌కు జతకూడడంతో నేడు మనం చూస్తున్న యూఏఈ ఉనికిలోకి వచ్చింది. 

Updated Date - 2021-11-29T02:28:50+05:30 IST